NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్వాంటం కంప్యూటింగ్ తోనే ఉజ్వల భవిష్యత్తు

1 min read

ప్రొఫెసర్ హెచ్ సుదర్శనరావు ఉపకులపతి  జెఎన్​టియు                                          

కర్నూలు, న్యూస్​ నేడు:             స్థానిక జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగవ స్నాతకోత్సవం ఘనంగా జరిగినది. 2021- 25 బ్యాచ్ బి. టెక్ , 2023- 25 బ్యాచ్ ఎంబిఏ విద్యార్థినీ విద్యార్థులకు పట్టా ప్రధానోత్సవం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య కన్నుల పండుగగా జరిగినది.ఈ కార్యక్రమానికి అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్. సుదర్శనరావు హాజరై విద్యార్థులతో మాట్లాడుతూ మీరు ఎంత ఉన్నతస్థాయి లో ఉన్న మీ తల్లిదండ్రుల త్యాగాలను మరవరాదన్నారు.ఏ బ్రాంచ్ లో చదివినా విషయ పరిజ్ఞానాన్ని  అందిపుచ్చుకున్నప్పుడే ఏదైనా సాధిస్తారని అన్నారు. కృత్రిమ మేధా కన్నా మానవ మేదనే గొప్పదని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ రాబోయే రోజుల్లో అన్ని బ్రాంచిల్లో ఉంటుందని, మన రాష్ట్ర ప్రభుత్వం ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి అమరావతిలో నెలకొల్పబోతుందని దీనివలన మరెన్నో అవకాశాలు వస్తాయన్నారు.జెఎన్​టియు అనంతపురం పరిదిలో అత్యుత్తమ విద్యను అందించే కళాశాల జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల అని తెలియజేశారు. అనంతరం రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య  మాట్లాడుతూ విద్యార్థులు కంకణ బద్ధులై కృషి చేస్తూ భావి జీవితానికి పునాదులు వేసుకునే దశ కళాశాల దశ అని కళాశాల విద్యను సద్వినియోగపరచుకోవాలని గుర్తు చేశారు. యువతరంలో అనంతమైన శక్తి దాగి ఉంటుందని వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవాలన్నారు. అనంతరం కళాశాల చైర్మన్ జి.వి.యం.మోహన్ కుమార్  మాట్లాడుతూ మా కళాశాల గ్రామీణ ప్రాంతంలో నెలకొల్ప బడినప్పటికీ ప్రపంచ మేధావులను తయారు చేస్తుందని తెలియజేశారు. ఈ ప్రాంత తల్లిదండ్రులు అందిస్తున్న స్పూర్తితో మున్ముందు మా కళాశాలలను ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు,వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

About Author