పేద విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నిరుపేద విద్యార్థులకు చేయూతనందించడంలో అందరూ సహకారాన్ని అందించాలని కర్నూల్ తాసిల్దారు రమేష్ బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశాంత ఉద్యోగుల కర్నూలు జిల్లా సంఘం ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో బంగారుపేట ఎలిమెంటరీ మున్సిపల్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ఎమ్మార్వో మురారి శంకరప్ప సౌజన్యంతో 70 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవాగుణాన్ని కలిగి ఉండాలన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప మాట్లాడుతూ చిన్నారులు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని కోరారు .కార్యక్రమంలో రిటైర్డ్ డి.ఎ.స్పి పాపారావు, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లయన్ తిరుపతి సాయి పాఠశాల ఉపాధ్యాయులు రఘు తదితరులు పాల్గొన్నారు.

