NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రానున్న వర్షాకాలంలో గోదావరి నదికి వచ్చే వరదలపై కలెక్టర్​ సమీక్ష

1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశం

గోదావరి వరదలకు సన్నద్ధత, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లుపై

అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:రానున్న వర్షాకాలంలో గోదావరి నదికి వచ్చే వరదలు కారణం ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి గురువారం   గోదావరి వరదలకు సన్నద్ధత, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, జిఎస్టి వసూళ్లు, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రగతి, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ   జూలై నుండి అక్టోబర్ నెల వరకు తుఫానులు,  వరదలు వచ్చే అవకాశం ఉన్నందున, అటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవించకుండా సంబంధిత శాఖల అధికారులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వరదల కారణంగా కాల్వలు, చెరువులు, ఏర్లు కు  గండ్లు పడే అవకాశం ఉన్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి వాటిని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలో మొదటి, రెండవ, మూడవ హెచ్చరికల సమయంలో  ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు ముందుగానే రూపొందించుకోవాలని,  ఆయా గ్రామాలలో 3 నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచాలన్నారు. వరదల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  బోట్లు, గత ఈతగాళ్లను  ముందుగానే గుర్తించాలన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షిస్తూ ముఖ్యమంత్రివర్యులు ఈనెల 13వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు విచ్చేసే అవకాశం ఉన్నదని , అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు.   ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రగతిపై సమీక్షిస్తూ, ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ ప్రక్రియను శుక్రవారం నాటికి  85 శాతం పూర్తిచేయాలన్నారు. ప్రగతిలో వెనుకబడిన అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకుని నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ చెప్పారు.జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు, జిల్లా పరిషత్ సిపిఒ జగదాంబ, డిపిఓ మల్లికార్జునరావు,  ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్రబాబు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి., ట్రాన్స్కో , ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ లు,వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు,ఎంపిడిఓ లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *