ఆదోని జిల్లా సాధన కోసం తలపెట్టిన బంద్ కు మద్దతు ప్రకటించిన సిపిఐ
1 min read

వాల్ పోస్టర్లు విడుదల చేస్తున్న జేఏసీ నాయకులు
పత్తికొండ, ఆదోని: ఆదోని జిల్లా సాధన కోసం ఈ నెల 24న జేఏసీ తలపెట్టిన బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య తెలిపారు. గురువారం జేఏసీ నాయకులు స్థానిక చదువుల రామయ్య భవనంలో బంద్ కు సంబంధించిన వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిపాలన సౌలభ్యం కోసం ఆదోని ని జిల్లా గా సాధించుకునేందుకు పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలన్నారు. ఆదోని జిల్లా సాధన కోసం ఈనెల 24న పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల బంద్ కు విద్యా సంస్థల యాజమాన్యాలు, వ్యాపార వాణిజ్య దుకాణదారులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి పి.భీమ లింగప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్, మండల కార్యదర్శి యు.కారుమంచి, కారన్న.జేఏసీ నాయకులు నాగభూషణం, జయరాముడు, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

