ప్రజలతో మమేకమైన మున్సిపాలిటీ కమిషనర్
1 min read

మెగా క్లీనింగ్ డ్రైవ్
జీరో శానిటేషన్,వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన..
నందికొట్కూరు, న్యూస్ నేడు : మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ జి.వెంకట రామిరెడ్డికాలనీ ప్రజలతో అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనివిద్యానగర్ 11వ వార్డులో శనివారం ఉ 5 గంటల నుండి శానిటేషన్ లో భాగంగా హాస్పటల్ రోడ్డులో చైతన్య పాఠశాల పక్కల నూతనంగా డ్రైవ్ వేస్తుండగా వాటిని మున్సిపాలిటీ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.వార్డులో అన్ని వీధులను కలియ తిరుగుతూప్రజల సమస్యలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.మీకు ఏమైనా సమస్యలుంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తాచెదారాన్ని డ్రైనేజీ కాలువల్లో మరియు రోడ్లపై వేయరాదని అదేవిధంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రావని కమిషనర్ ప్రజలకు వివరించారు.ఆ తర్వాత ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు.చక్కగా చదువుకోవాలని కమిషనర్ విద్యార్థులతో అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ భోజనం ఇవ్వాలని అదేవిధంగా హాస్టల్ శుభ్రంగా ఉండే విధంగా చూడాలని భోజనం శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని వార్డెన్ కు సూచించారు.తర్వాత మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా థీమ్ ఆయన జీరో గ్యాప్ శానిటేషన్ వ్యక్తిగత పరిశుభ్రత,వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్వహణ అనే అంశంపై పట్టణంలో మెగా క్లీనింగ్ డ్రైవ్ చేపట్టారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత మరుగుదొడ్ల నిర్వహణ ప్రతి సంవత్సరం సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయుట, బహిరంగ మల మూత్ర విసర్జన,బ్యానర్ల నిషేధం, నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించి అధికారులు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సుహ్రులత,ఏఈలు దినేష్ కుమార్,మనోజ్ రెడ్డి, వార్డు ఇంచార్జ్ రజినీకుమార్ రెడ్డి,మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

