NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదవాడి మనసు దోచుకుంటున్న నిజమైన నాయకుడు – ఈడిగ గోవింద్ గౌడ్

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈడిగ గోవింద్ గౌడ్ పేద ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం, ప్రజల అవసరాలకు వెంటనే స్పందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న నాయకుడిగా నిలుస్తున్నారు.ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈడిగ గోవింద్ గౌడ్‌కు ఆలూరు నియోజకవర్గ ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని స్థానిక నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *