ప్యాపిలి పీహెచ్‌సీని సందర్శించిన జిల్లా క్షయ, కుష్ఠు వ్యాధుల అధికారి
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా క్షయ మరియు కుష్ఠు వ్యాధుల అధికారి డాక్టర్ శారదాభాయి సందర్శించారు. ఈ సందర్భంగా క్షయ (టీబీ), కుష్ఠు వ్యాధులకు సంబంధించిన రికార్డులు, నివేదికలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.క్షయ వ్యాధి నిర్ధారణ కోసం అవసరమైన స్పుటం నమూనాలను ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు సంచార వైద్య సేవలు (104) ద్వారా ప్రతిరోజూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రాహుల్, రాఘవేంద్ర గౌడ్, సరోజ, శ్రీనివాసులు, మల్లికార్జునతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


