NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అకౌంటెంట్ శ్రీనివాసులు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేత

1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు, న్యూస్​  నేడు: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోనెగండ్ల మండలానికి చెందిన సమగ్ర శిక్ష మండల అకౌంటెంట్ (అవుట్ సోర్సింగ్ ఉద్యోగి) శ్రీనివాసులు కుటుంబానికి ప్రభుత్వం  మంజూరు  చేసిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా  చెక్ ను  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి  సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆయన భార్య  మంజులకు  అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… శ్రీనివాసులు అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషాదాన్ని ప్రభుత్వం  పరిగణించి, బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా ఎక్స్గ్రేషియా మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన  కలెక్టర్ వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,  ప్రభుత్వం నుంచి లభించే ఇతర సంక్షేమ పథకాలు అందేలా  సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్  సూచించారు.ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ లోక్ రాజు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *