NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే  – అవగాహన సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జడ్జి మరియు అధ్యక్షులు జి. కబర్థి సూచనల మేరకు శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారు కర్నూలు కోర్టు కాంపౌండ్ లో గల న్యాయ సేవా సదన్ నందు అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే సంధర్భంగా సంభంధిత అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో జడ్జి , చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శివరామచంద్ర రావు గారు, ICDSవిమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ   మాట్లాడుతు అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ను ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. కనిపించకుండా పోయిన పిల్లల సమస్యపై అవగాహన పెంచడం, పిల్లల భద్రతను బలోపేతం చేయడం మరియు బాధిత కుటుంబాలకు మద్దతు ఇవ్వడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే పిల్లల రక్షణకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ అవగాహన దినాలలో ఒకటిగా గుర్తించబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు వివిధ కారణాల వల్ల కనిపించకుండా పోతున్నారు. కొంతమంది పిల్లలు ఇంటి నుంచి తప్పిపోతుండగా, మరికొందరు కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, ఆన్‌లైన్ మోసాలు లేదా కుటుంబ సమస్యల కారణంగా అదృశ్యమవుతున్నారు.అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చు. తెలియని వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి, ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే పెద్దలకు చెప్పాలి, ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు భాగస్వామ్యం చేయకూడదు, తప్పిపోయినప్పుడు సహాయం ఎలా కోరాలో తెలుసుకోవాలి, సురక్షిత ప్రదేశాలను గుర్తుంచుకోవాలి, ఈ పాఠాలు పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. పిల్లల భద్రతలో పాఠశాలల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. స్కూళ్లు విద్యార్థుల భద్రతకు సంబంధించిన స్పష్టమైన విధానాలు అమలు చేయాలి. సురక్షిత రవాణా, విజిటర్ నియంత్రణ, హాజరు పర్యవేక్షణ, పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు, పిల్లలు భద్రంగా ఉన్నప్పుడు మాత్రమే వారు విద్యపై పూర్తిగా దృష్టి పెట్టగలరు.తప్పిపోయిన పిల్లల కోసం న్యాయ సేవలు ఎప్పుడు అందుబాటులో ఉన్నాయని, పోలీసులు,  పీఎల్‌వీలు  అందుబాటులో ఉంటారని, అవసరమైన పిల్లలు లేదా తల్లిదండ్రులు తప్పిపోయిన పిల్లల విషయాలలో అవసరమైన న్యాయ సహాయం లేదా సలహా కోసం పీఎల్‌వీల సేవలను పొందవచ్చని తెలిపారు.  పిల్లల హక్కులపై, అలాగే తప్పిపోయిన పిల్లల గురించి పోలీస్, విద్యా శాఖ, శిశు సంక్షేమ శాఖ మరియు కార్మిక శాఖలు కలిసి అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, కుటుంబానికి అప్పగించడం లేదా పిల్లలను సరైన సంస్థలో పునరావాసం కల్పించడం కోసం కృషి చేయాలని తెలియజేసారు. తప్పిపోయిన పిల్లల ప్రయోజనం కోసం పనిచేస్తున్న ఎన్జీఓలు, తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో, తల్లిదండ్రులకు అప్పగించడంలో లేదా తగిన గృహంలో చేర్చడంలో, అలాగే తప్పిపోయిన పిల్లల కేసులలో వారి సహాయం అందించడంలో చురుకుగా పాల్గొనాలి అన్నారు. తప్పిపోయిన పిల్లలు లేదా ఆచూకీ తెలియని పిల్లల విషయంలో అవసరమైన విధంగా తప్పిపోయిన పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాల మిస్సింగ్ చిల్డ్రన్స్ సమాచారాన్ని సేకరించి వాటిని త్వరగా పరిష్కారిచండి అని తెలేయజేసారు.  ఈ కార్యక్రమంలో సంభంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *