NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యుత్ ఉద్యోగులు జేఎల్ఎం గ్రేడు2 సమస్యలు వేంటనే పరిష్కరించాలని వినతి

1 min read

కడప , న్యూస్ నేడు: విద్యుత్- జేఎల్ఎం గ్రేడు 2ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రులు గొట్టిపాటి రవికుమార్.ఎన్ ఎం డి పరూక్ కు విజయవాడ లో జేఎల్ఎంగ్రేడు 2ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు.విద్యుత్ శాఖ ఎంప్లాయిస్ అసోసియేషన ఓ అండ ఏం డైరీ ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ విజయవాడలో ఆవిష్కరించారు. సందర్భంగా ఈ సందర్భంగా విద్యుత్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఓ అండ్ ఎం ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఓ అండ్ ఎం విద్యుత్ శాఖ ఉద్యోగులు మంత్రికి జేఎల్ఎం గ్రేడ్2 సమస్యలపై వినతి పత్రం అందజేశారు.2019 సంవత్సరంలో నియమితులైన జూనియర్ లైన్మెన్లు అత్యంత ప్రమాదకర పరిస్థితులలో నిజాయితీగా సేవలు అందిస్తు తమ ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. అయితే కోర్టు కేసుల కారణంగా వీరిని ఇప్పటివరకు విద్యుత్ శాఖలో విలీనం చేయకపోవడం వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవడం జరుగుతుందని మంత్రికి తెలిపారు. సచివాలయాల వ్యవస్థ ద్వారా మాతోపాటు నియమించబడిన ఇతర శాఖల వారికి వారి వారి మాతృ శాఖల యందు పాత సర్వీసుల రూల్స్ ప్రకారం ప్రమోషన్లు  2024లో ఇవ్వడం జరిగిందని ఉదాహరణకు  వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, పశు సంవర్ధక శాఖ లలో పర్మినెంట్ చేయడం జరిగిందన్నారు. విద్యుత్ శాఖలో ఓ అండ్ యం విభాగము విద్యుత్ శాఖకు వెన్నెముక లాంటిదని రెగ్యులర్ ఉద్యోగులు 365 రోజులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతర  విద్యుత్ సరపర అందించేందుకు తమ వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. అలాంటివారికి సరైనటువంటి గౌరవం దక్కడం లేదని వారానికి ఒక రోజైనా సెలవు ప్రకటించాలని అదేవిధంగా వారికి ప్రత్యేక పిఆర్సి మంజూరు చేసి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు మంత్రికి వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగిందని ఓ అండ్ ఎం విద్యుత్ ఎంప్లాయిస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓ అండ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు పాల రాజు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దవనం దొరబాబు, జనరల్ సెక్రెటరీ రమేష్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ రాజు, ట్రెజరర్ వై రాజు, జాయింట్ సెక్రెటరీ జి శ్రీనుబాబు, ఈసీ మెంబర్ జయరాజు, గిరి తదితరులు పాల్గొన్నారు.

About Author