పత్తి పంట పొలాలను పరిశీలించిన ఆలూరు ఎమ్మెల్యే
1 min read

ఆలూరు, న్యూస్ నేడు: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మీడియా తో మాట్లాడుతు….టీవల కాలంలో భారీ వర్షాల కారణంగా పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పత్తి కాయలు కూడా కుళ్ళిపోతున్నాయి…కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు తప్ప ప్రజలు ఎవరు బాగుపడలేదు అన్నారు . కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కట్టిన ఇన్సూరెన్స్ నిధులు కూడా ఇవ్వలేదన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్ మెహన్ రెడ్డి రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు . పత్తి అమ్మిన కూడా పెట్టుబడికి పెట్టిన సగం డబ్బులు కూడా రావడం లేదన్నారు, అంతేకాకుండా రైతులు అప్పుల పలు అవుతున్నారు . అంతేకాకుండా పత్తి కి కనీసం మద్దతు ధర కూడా లేదన్నారు… కూటమి ప్రభుత్వం పత్తి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని , అలాగే పత్తి కి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

