NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది

1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు:  యూటీఎఫ్ ప్యాపలి మండల శాఖ ఆధ్వర్యంలో ప్యాపలి బాలుర ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ ప్యాపలి మండల శాఖ అధ్యక్షులు రమేష్ నాయుడు అధ్యక్షతన డిఎస్సీ  2025 నూతన ఉపాధ్యాయులకు అభినందన సభ ఏర్పాటు చేశారు.సభకు ముఖ్య అతిథులుగా డోన్ మండల విద్యాధికారి రఘునాయక్ ,యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి,యూటీఎఫ్ మాజీ జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్.ఎస్.బాబు,జన విజ్ఞాన వేదిక  రాష్ట్ర రాష్ట్ర సహాధ్యక్షులు మాణిక్యం శెట్టి,యూటీఎఫ్ ప్రస్తుత నంద్యాల జిల్లా గౌరవాధ్యక్షులు సుబ్బారాయుడు,జన విజ్ఞాన వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు రామ మూర్తి ,జన విజ్ఞాన వేదిక నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి,యూటీఎఫ్ మాజి జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్,డోన్ మండల యూటీఎఫ్ అధ్యక్షులు లక్ష్మీనాయక్ హాజరై ప్రసంగించారు.అన్నారు.కొత్తగా ఎన్నికైన ఉపాధ్యాయులు అందరిని ఇలా ఒక్కచోట చేర్చి గౌరవించినందుకు యూటీఎఫ్ సంఘానికి కృతఙ్ఞతలు చెప్పారు.కొందరు వారి క్లిష్ట పరిస్థితుల్లో నుండి విజయ తీరాలకు చేరిన తీరును వివరించారు.కార్యక్రమంలో బాషా,అమీర్ బాషా,ఆంజనేయ,గోపాల్,సర్వోత్తమ రెడ్డి,రాజేంద్ర..కొత్తగా DSC 2025 కి ఎన్నికైన నూతన ఉపాధ్యాయుల మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author