బ్రెయిలి లిపి సృష్టికర్తకు ఘన నివాళి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : ” ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి .లీల వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు పసుపుల రోడ్ నందు గల అమ్మ అంధుల పాఠశాల నందు న్యాయ సేవాధికారిక సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ సభ్యులు లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైజర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రెయిలి లిపి పై మరియు వారి హక్కులపై పిల్లలు కు అవగాహన కల్పించారు. బ్రెయిలీ భాషను కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈరోజు ప్రపంచ బ్రెయిలీ డే గా జరుపుకుంటారని తెలిపారు. అందులు మరియు దృష్టిలోపం ఉన్నవారికి మానవ హక్కులను పూర్తిగా సాధించడంలో కమ్యూనికేషన్ సాధనంగా ఈ బ్రెయిలీలిపి ఉపయోగపడుతుందని తెలిపారు. దృష్టిలోపం గల పిల్లలకు చట్టపరమైన సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 కు కాల్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పిల్లలకు బ్యాగులను పంచిపెట్టారు.

