NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనంతపురం సభను జయప్రదం చేయాలి

1 min read

మంత్రాలయం  జనసేన ఇన్చార్జి  బి లక్ష్మణ

మంత్రాలయం న్యూస్ నేడు :  నేడు అనంతపురం లో జరిగే సభను జయప్రదం చేయాలని మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న పిలుపునిచ్చారు. మంగళవారం తన నివాసంలో విలేకరుల తో మాట్లాడుతూ అనంతపురం లో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన సైనికులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జనసేన పార్టీ కౌతాళం మండల నాయకులు కుంటనాల  రాంప్రసాద్ లక్ష్మన్న కు మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న తో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.  మంత్రాలయం నియోజకవర్గం లో జనసేన పార్టీని గ్రామ గ్రామాన పటిష్టత పరుస్తామని  పవన్ కళ్యాణ్  ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని తెలిపారు.   కొన్ని రోజుల క్రితం నుంచి కొన్ని కారణాల వలన పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని ఇక నుంచి లక్ష్మన్న నాయకత్వంలో ముందుకు సాగుతామని  నియోజకవర్గం లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కోట సీట్లు ఇవ్వాలని కోరారు.

About Author