NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాణిపాక వరసిద్ధి వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పణ

1 min read

మహానంది, న్యూస్ నేడు:  మహానంది దేవస్థానం తరపున ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి కాణిపాకం లో వెలసిన వరసిద్ధి వినాయక స్వామికి పట్టు పీతాంబర  వస్త్రాలు మంగళవారం సాయంత్రం సమర్పించారు. కాణిపాక క్షేత్ర ఆలయ ఈవో కే పెంచల కిషోర్ వీరికి స్వాగతం పలికారు. అనంతరం క్షేత్రంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు .కాణిపాక క్షేత్రంలో జరిగే వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం మహానంది ఆలయం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించినట్లు మహానంది ఆలయ ఈవో నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం పూజా కార్యక్రమాలు అనంతరం మహానంది దేవస్థాన కార్య నిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి మరియు ఏఈఓ మధు లను దుశ్యాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను కాణిపాక దేవస్థానం ఈవో కే పెంచల కిషోర్ అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో మహానంది దేవస్థానం ఏఈఓ మధు మహానంది దేవస్థానం అవధానులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, మహానంది దేవస్థానం ఉప ప్రధానార్చకులు కొమ్ముద్ది శంకరయ్య పలువురు మహానంది దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author