NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో ఆంధ్ర విద్యా ఉద్యమం ప్రారంభం   

1 min read

కర్నూలు, న్యూస్ నేడు : స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO) ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో “ఆంధ్ర విద్యా ఉద్యమం – అన్వేషించండి ,  ప్రోత్సహించండి , సాధికారత” ను శనివారం కర్నూలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా SIO రాష్ట్ర అధ్యక్షుడు బ్రదర్ అమీర్ ఫహద్ మాట్లాడుతూ  ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 30 వరకు జరగబోయే  ఉద్యమంలో నాయకులు రాష్ట్ర విద్యా విధానం, బడ్జెట్ కేటాయింపులు, విద్యా హక్కు చట్టం (RTE) అమలు, ఉన్నత విద్య వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు.  అనంతరం ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు డా. అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం, ఉస్మానియా కళాశాల, ఐడియల్ స్కూల్లను సందర్శించి, ఆయా సంస్థల బాధ్యులతో విద్యా సమస్యలు మరియు అభివృద్ధి అవసరాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో, జిల్లా నిర్వాహకుడు (చిత్తూరు–అన్నమయ్య) బ్రదర్ అబ్దుల్ ముజీబ్ ఖాన్, బ్రదర్ మాన్సూర్, బ్రదర్ అబ్దుల్లా పాల్గొన్నారు.

About Author