క్రేడో స్కూల్ లో మట్టి వినాయకుల తయారీ పోటీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: శ్రీ గణేశ మహోత్సవ కేంద్ర సమితి కర్నూలు సంస్కార భారతి వారి ఆధ్వర్యంలో ఈరోజు బి తాండ్రపాడు క్రేడో స్కూల్ నందు విద్యార్థులకు గణేశ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా వ్యాసరచన వక్తృత్వ మరియు చిత్రలేఖనం ,మట్టి వినాయకుల తయారీ పోటీ జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల నుండి 650 మంది విద్యార్థులు పాల్గొని ఆయుర్వేద జీవన విధానం ,ఉపనిషత్తులలోని ఏవైనా రెండు సంవాదాలు,నారీశక్తి ,ఆపరేషన్ సింధూర్, భారత సాంస్కృతిక వైభవం ,స్వదేశీ మరియు స్వావలంబన్ ,విద్యార్థులకు పనికివచ్చే ఏదైనా ఒక సుభాషితం ,పంచతంత్రం కథలు ,షోడస సంస్కారాలు, సాధన చతుష్టయం ,యోగ వల్ల విద్యార్థులకు కలిగే లాభాలు ,విజయం కోరుకునే విద్యార్థులకు ధ్రువ జ్ఞానం యొక్క ఆవశ్యకత వంటి అంశాలపై పోటీలలో పాల్గొని సంస్కారాలు పొందారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి రాష్ట్రీయ సేవిక సమితి ప్రాంత బౌద్ధి క్ ప్రముఖ్ శ్రీమతి లలిత గారు చిన్న చిన్న కథల ద్వారా విద్యార్థులలో సంస్కృతి సాంప్రదాయాలు శాస్త్రీయ దృక్పథం మహాపురుషుల జీవితాలు తెలియజేస్తూ పిల్లల్లో చిన్నతనం నుండి శుభసంస్కారాలను మొలకెత్తించారు ముందు ముందు వీరే విశాల వటవృక్షంగా ఎదిగి భారతీయ సంస్కృతి వైభవాన్ని రక్షించే సమర్థులు కాగలరని తెలిపారు .విద్యార్థులు భారత భవిష్యత్తు ప్రపంచ గౌరవము మరియు తల్లిదండ్రులకు గర్వకారణము వారిలో సామర్థ్యం అనే అనంత బాండగారం దాగి ఉంది దానిని వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఉత్తమ శీల నిర్మాణము భారతీయ సంస్కృతి గొప్పదనాల గురించి పరిచయం చేశారు . అలాగే వివిధ పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ ఉపాధ్యాయుల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత గుర్తు చేశారు.అలాగే గణేశ ఉత్సవ సమితి జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ మోక్షేశ్వర్ విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు వివరించారు అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ గణేష్ మహోత్సవాలలో భాగంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఆదర్శంగా వినాయక చవితి సంబరాలు జరుపుకోవాలని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోరంట్ల రమణ నగర అధ్యక్షులు శ్రీ రంగస్వామి చింతలపల్లి రామకృష్ణ పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పాఠశాల యాజమాన్యం శ్రీమతి శ్రావ్య మరియు శ్రీ కార్తీక్ పిల్లలను ఇలాంటి ఉత్తమ సంస్కారాలు నింపే కార్యక్రమం వారి పాఠశాల నందు జరిగినందుకు ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇలాంటి మంచి కార్యక్రమాలకు మేము ఎల్లప్పుడూ ముందుంటామని పిల్లలందరికీ ఆశీర్వాదాలు అందజేశారు ఇట్లు సంస్కార భారతి నగర ప్రముఖు శ్రీ మాకం నాగరాజు.

