NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణపై టీడీపీ సమావేశం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ ప్యాపిలి మండల విభాగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సమన్వయ కార్యదర్శి ఎస్. గోవర్ధన్, ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరావు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా యూనిట్ ఇన్‌చార్జ్ రామ్మోహన్ యాదవ్ తన నివాసానికి వారిని ఆహ్వానించి, కుటుంబ సభ్యులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర సమన్వయ కార్యదర్శి ఎస్ గోవర్ధన్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్యాపిలి మండలంలోని 32 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించి, ప్యాపిలి గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో కృషి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.బీఎల్‌వోలతో సమన్వయంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్యాపిలి పట్టణంలో ఇప్పటికే సుమారు 60 శాతం ఓటరు నమోదు పూర్తైందని, మిగిలిన 40 శాతం నమోదు కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి యూనిట్ ఇన్‌చార్జ్ తమ పరిధిలోని ప్రతి ఓటును జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బీఎల్‌వోలతో సంప్రదించాలని సూచించారు. సమావేశం సందర్భంగా మాజీ ఎంపీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని రాష్ట్ర సమన్వయ కార్యదర్శి ఎస్. గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లారు.దీనిపై స్పందించిన ఎస్. గోవర్ధన్ మాట్లాడుతూ, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరగదని తెలిపారు. శ్రీనివాసులు ప్రస్తావించిన అంశాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి, తగిన విధంగా పరిశీలించి పార్టీలో సముచిత స్థానం కల్పించేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే పార్టీ అభివృద్ధి కోసం ఇదే అంకితభావంతో కొనసాగాలని శ్రీనివాసులను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, టీడీపీ మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, జనరల్ సెక్రటరీ నడిగడ్డ నాగేంద్ర, రాష్ట్ర ఎస్టీ/బీసీ సెల్ అధికార ప్రతినిధి మధుకుమార్, నాయకులు కృష్ణమోహన్, గండికోట పెద్ద రామాంజనేయులు, కడితం ప్రతాప్‌రెడ్డి, నారేంద్ర, మద్దిలేటి, ఆనంద్,పుల్లయ్య, భాస్కర్ నాయుడు తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *