NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే కోట్ల జన్మదినం సందర్భంగా విద్యార్థులకు అన్నదానం

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  డోన్ శాసనసభ సభ్యులు కోట్ల జయసుర్య ప్రకాశ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్యాపిలి పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మాజీ ఎంపీటీసీ గోల్ల రామ్మోహన్ యాదవ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెదేపా నాయకులు ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా పీర్, తేదేపా నాయకులు గడ్డం అంకిరెడ్డి ఆహ్వానం మేరకు హాజరై వారి చేతుల మీదుగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్ ఎమ్మెల్యే  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు  అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, మరెన్నో ఉన్నతమైన పదవులు రాణించాలని  వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు గండికోట పెద్ద రామాంజనేయులు, గొల్ల మద్దిలేటి, జక్కసానికుంట్ల మహేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author