హక్కుల సాధనకై, ఉద్యమ పోరాటంలో మరో ముందడుగు!
1 min read
రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఏ.విద్యాసాగర్ , సెక్రెటరీ జనరల్ కేఎస్ఎస్.ప్రసాద్ పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ యొక్క సమస్యల పరిష్కారం కొరకు
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులో నేడు బొగ్గుల దస్తగిరి, కోడుమూరు నియోజకవర్గము ఎమ్మెల్యే కి కర్నూలు ఏపీజేఏసీ (APJAC) నాయకత్వంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.జిల్లా జేఏసీ ఛైర్మన్ వి.జవహర్ లాల్, జిల్లా సెక్రెటరీ S.ఇస్మాయిల్ మరియు ఏపిఎన్జీజివో జిల్లా కార్యదర్శి ఎం.సి.కాసన్న గారి నాయకత్వంలో సభ్య సంఘాల నాయకులు అందరూ కలిసి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా గత 3 సంవత్సరాలుగా పెండింగులో ఉన్న వేతన సవరణ, సరెండర్ లీవుల చెల్లింపు, 4 కరవు భత్యాల విడుదల, ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు, సీపీఎస్ రద్దు, ఎంప్లాయిస్ మరియు పెన్షనర్స్ హెల్త్ కార్డ్స్, మెడికల్ రియంబర్స్మెంట్ తదితర 10 అంశాలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:ఏపిఎన్జీజివో జిల్లా సహధ్యక్షులు: ఈశ్వరయ్య, ఏపిఎన్జీజివో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ: రామకృష్ణ రెడ్డి, ఏపీజేఏసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ: సాంబశివరెడ్డి, ఏపిఎన్జీజివో జిల్లా కోశాధికారి: భాస్కర్ నాయుడు, ఏపిఎన్జీజివో జిల్లా ఉపాధ్యక్షులు: కృష్ణమోహన్, సుధాకర్, ఏపిఎన్జీజివో జిల్లా సంయుక్త కార్యదర్శి: రమణ, కృష్ణుడు, కర్నూలు తాలూకా ఏపిఎన్జీజివో అధ్యక్ష, కార్యదర్శులు: రామకృష్ణ, సాయిరాం, కోడుమూరు తాలూకా ఏపిఎన్జీజివో అధ్యక్ష, కార్యదర్శులు: శ్రీనివాసులు, చంద్రశేఖర్, పెన్షనర్స్ అధ్యక్ష, కార్యదర్శులు: లింగన్న, శివా రెడ్డి, నాయకులు మహానంది రెడ్డి, వెటేరినరియన్ ఫెడరేషన్ ఛైర్మన్: వెంకటేశ్వర్లు, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర రావు, మరియు ఏపిఎన్జీజివో నాయకులు కరీముల్లా, సురేశ్, జనార్ధన రెడ్డి రామసుబ్బయ్య, హరిగౌడ్, నాగరాజు, చలపతి, కృపాసాగర్, శ్రీరాములు, శ్రీనివాసులుతో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగినది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇవ్వడం జరిగినది.

