ఏపీ శాలివాహన కుమ్మరి సంక్షేమ డైరెక్టర్ల సమావేశం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: విజయవాడ గొల్లపూడి బీసీ భవన్లో బిసి శాఖ మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాలివాహన కుమ్మరి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ల సమావేశంలో హాజరైయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాలోని కుమ్మరి వృత్తిదారుల సమస్యలను మరియు త్వరలో ప్రవేశపెడుతున్న ఆదరణ 3.0 పథకానికి సంబంధించి వృత్తిదారులకు కావలసిన పరికరాల గురించి జిల్లాల నుంచి వచ్చిన డైరెక్టర్ల సలహాలు సూచనలను మంత్రి సవితమ్మ తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్,బీసీ సంక్షేమ కార్యదర్శి ఐఎఎస్ సత్యనారాయణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్ ,మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.


