చెకుముకి మండల స్థాయి విజేతలకు అభినందనలు
1 min read
మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస రావు .
ప్యాపిలి న్యూస్ నేడు:ప్రతి విద్యార్థి శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయిలో విద్యార్థులకు నిర్వహించిన చెకుముకి సైన్స్ పరీక్ష నందు పాల్గొన్న విద్యార్థులతో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీడీవో.శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రాహుల్ , మండల విద్యాధికారి వెంకటేష్ నాయక్ ,బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మా బాయి తెలిపారు .మూఢనమ్మకాలు ఇప్పటికీ కొన్ని అక్కడక్కడ మనం చూస్తున్నామని కానీ విద్యార్థులైన మీరు వాటిని రూపు మాపాలని అన్ని రోగాలకు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కుక్క కాటుకు,పాము కాటుకు నాటు వైద్యం వద్దని,కరోనా లాంటి మహమ్మారిని సైతం వ్యాక్సిన్ ద్వారానే అరికట్టగలిగామని, కేవలం సైన్స్ వల్లనే ఇది సాధ్యమైందని ,కావున మూఢ నమ్మకాలు ,మూఢాచారాలు నమ్మవద్దని .ఇప్పటి నుండే ప్రశ్నించే తత్వాన్ని శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలని వారు అన్నారు.అనంతరం పాఠశాల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మండల స్థాయిలో సైన్స్ పరీక్షను నిర్వహించడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి మరియు అబ్దుల్ లతీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ పరీక్షల నందు మండలంలోని ఉన్నత పాఠశాలల నుండి 15 బృందాలు పాల్గొనడం జరిగినది. ఈ పోటీల నందు రాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీ పాఠశాల, ప్యాపిలి బాలికల ఉన్నత పాఠశాల, సరస్వతి శిశు మందిరం మరియు ఏనుగుమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచి జిల్లా స్థాయిలో జరిగే పరీక్షలకు ఎంపిక కావడం జరిగినది. విజేతలకు మండల అధికారులచే మూమెంటోలు ,సర్టిఫికెట్స్ మరియు విలువైన పుస్తకాలు అందచేయడం జరిగినది.ఈ కార్యక్రమం నందు యూటీఎఫ్ మండల అధ్యక్షులు రమేష్ నాయుడు,యూటీఎఫ్ నాయకులు మద్దిలేటి,అమీర్,మదన్,రమేష్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

