87వ విశ్వశాంతి మహా యాగం మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్
1 min read
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ కృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొనేందుకు ఎమ్మిగనూరుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మరియు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కి స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించారు.అనంతరం వీవర్స్ కాలనీ మైదానంలోని యజ్ఞశాలలో అట్టహాసంగా నిర్వహించిన హనుమాత్ సహిత సుబ్రహ్మణ్య హోమములు, చండీ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి వేదాశీస్సులు అందజేసి ప్రసాదాలు వితరణ చేశారు.

