ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు
1 min read

ఎంఎస్ ప్రిన్సిపాల్ బిటీ శ్రీదేవి..
మిడుతూరు , న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న మోడల్ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరుటకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బిటీ శ్రీదేవి మంగళవారం అన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఈనెల 23 నుండి మార్చి 31 వరకు విద్యార్థుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.విద్యార్థులు ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతూ ఉండాలని ఆరవ తరగతిలో 100 సీట్లు ఉన్నాయని ఏప్రిల్ 12వ తేదీ మిడుతూరు మోడల్ పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఏప్రిల్ 27 న విద్యార్థుల మెరిట్ లిస్టును విడుదల చేస్తామని ప్రిన్సిపాల్ శ్రీదేవి అన్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని అన్నారు.


