బీసి రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలి
1 min read

హోళగుంద న్యూస్ నేడు : బీసీ సింహ గర్జన” లో చేసిన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని వెంటనే నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూర్ క్వామ్రా కి వినతిపత్రాన్ని ఇచ్చిన బిసివై పార్టీ జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ మరియు రాష్ట్ర ఈసి మెంబర్ కంది వరుణ్ కుమార్ యాదవ్.79 సంవత్సరాలుగా బీసీలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం గురించి ప్రభుత్వానికి తెలియనిది కాదు. ఈ చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దాలనే లక్ష్యంతో మా బిసివై పార్టీ “బీసీ సింహ గర్జన” ద్వారా బీసీల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన 1. బీసి రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలి. 2. అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000ఎకరాలు కేటాయించాలి. 3.రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి.4.విద్యా, ఉధ్యోగాల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 44%శాతం రిజర్వేషన్ కల్పించాలి.5.బీసీ కార్పోరేషన్ లకు వెంటనే నిధులు విడుదల చేయాలి. అనే ఈ 5 కీలక డిమాండ్లను ప్రకటించడం జరిగింది. జిల్లా పరిపాలనా అధికారిగా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేయడంలో మీ పాత్ర అత్యంత కీలకమైనది. ఈ ఈ నేపథ్యంలో మా డిమాండ్ల ప్రాధాన్యతను ప్రభుత్వానికి వివరించి వాటిని నెరావేర్చాల్సిన భాధ్యతను గుర్తు చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. మా డిమాండ్లు పరిష్కారం కోసం నిరసన తెలిపే హక్కును వినియోగించుకుంటామని బిసివై పార్టీ తరుపున జాయింట్ కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది.ఒకవేళ నిర్దేశిత గడువులోగా ప్రభుత్వం మా డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో మాకు వేరే మార్గం లేక మా పార్టీ అధినేత శ్రీ బోడె రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీ నుండి శాంతియుతంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపి హక్కులను వినియోగించుకుంటామని బిసివై పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.

