సీమ గొంతు కోయడానికి సన్నద్ధం అయ్యారా.?
1 min read
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి
పోతిరెడ్డిపాడును సందర్శించిన వైకాపా సీమ నేతలు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: తెలంగాణ,ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీరిద్దరూ కలసి రాయలసీమ గొంతు కోయడానికి సన్నద్ధం అయ్యారా..శ్రీశైలం మరియు రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం చేయడం చాలా సిగ్గుచేటని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమకు చెందిన వైకాపా నేతలు కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి,కాటసాని రాంభూపాల్ రెడ్డి,జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి,శైలజా నాథ్, శిల్పా చక్రపాణి రెడ్డి,శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి,వైకాపా నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ సుధీర్ తదితరులు ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా పాత్రికేయులతోశైలజా నాథ్ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం గొప్ప ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందించాలన్నారు.కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ సొంత రాష్ట్రానికి ప్రయోజనాలను కాలరాసే విధంగా తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ సుదీర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజమా అబద్దమా అనేది చంద్రబాబు చెప్పాలని రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

