NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాయుధ పోరాట వీరుడు వడ్డే ఓబన్న

1 min read

ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకం

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

కర్నూలు , న్యూస్​ నేడు : ప్రజల సమస్యలు తీర్చడానికి  సాయుధ పోరాట యోధుడు వడ్డే ఓబన్న చేసిన కృషి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి  ఓబన్న  జన్మదినం సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడుతూ… బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న సమయంలో, రేనాటి పాలెగాళ్లకు, కంపెనీకి మధ్య ‘కమర్జు భత్యాల’ విషయంలో మొదలైన ఘర్షణలు పోరాటాలుగా మారాయన్నారు. ఆ పోరాటాల్లో ముఖ్యమైనది నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటం అని, ఈ వీరోచిత పోరాటంలో సైన్యాధ్యక్షుడిగా వడ్డె ఓబన్న  అత్యంత కీలక పాత్ర పోషించారన్నారు. ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తెలిపారు.ఓబన్న  భయం అనేది ఎరగకుండా వడ్డెర్లు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించారన్నారు. దట్టమైన నల్లమల అడవుల్లో బ్రిటిష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి, వారిని చెల్లాచెదురు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. తన నాయకుడైన నరసింహారెడ్డిని, ఆయన కుటుంబాన్ని రక్షించడంలో ఓబన్న ఎప్పుడూ ముందుండేవారన్నారు.. ఈరోజు ఆయన జీవిత చరిత్రని తలుచుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు… స్వాతంత్ర్య సమరయోధులు మనకు నేర్పింది ఒక్కటే – నిస్వార్థంగా, ఐకమత్యంతో పని చేయాలని నేర్పించారన్నారు.. వడ్డెర కమ్యూనిటీ యువత చదువుల్లో మరియు ఉద్యోగాల్లో రాణించి, సమాజ అభివృద్ధికి తోడ్పడాలన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 11 న ప్రత్యేకంగా వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించిందని,  ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవడం అవసరమని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.కొండారెడ్డి బురుజు నుంచి అలంపూర్ వరకు ఉన్న టన్నెల్ (సురంగం) అభివృద్ధి చేయాలని కోరారని, దీనిని తప్పకుండా పరిశీలిస్తాం అన్నారు.వడ్డె ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రదేశాలను సిఫార్సు చేశారని,  విగ్రహం  ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన మాట్లాడుతూ… స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని  ప్రభుత్వం గత సంవత్సరం ప్రత్యేక జీవో ద్వారా తెలపటం జరిగిందని తెలిపారు.స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న  జీవిత చరిత్ర లోని ముఖ్యంశాలను వివరించారు….వడ్డే ఓబన్న 11 జనవరి 1807 సంవత్సరంలో  నంద్యాల దగ్గర నొస్సం గ్రామంలో జన్మించారు. తొలి నుండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే వారని , 1845 సంవత్సరంలో 9,000 మందితో రైతుల హక్కులను కాపాడే ఉద్దేశంతో  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం, ప్రజల హక్కులను కాపాడడం ధ్యేయంగా పనిచేశారు. 1857 లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి వీరి ఉద్యమం నాంది పలికింది. 1846 అక్టోబర్ 6న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని పట్టుకోడానికి బ్రిటిష్ వారు వెళుతున్న సమయంలోనే పేరు సోమల గ్రామం సమీపంలో బ్రిటిష్ వారు ఓబన్న ను కాల్చి చంపారు అని వివరించారు. వడ్డేర రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీకాంతం మాట్లాడుతూ…మా 20 సంవత్సరాల పోరాట ఫలితంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటం సాధ్యమైందని తెలుపుతూ ఈ రోజు అనంతపురంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక కార్యక్రం జరుగుతున్నదని తెలిపారు.22వేల జనాభా కలిగిన కర్నూలు పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్టించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.వడ్డెర రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రిక మాట్లాడుతూ…45 సంవత్సరాలు దాటిన వడ్డెర మహిళలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని  కోరారు.సంస్కృత భాష ఉపాధ్యాయులు సర్వేశ్వరరావు , జైపాల్ బాబు లు మాట్లాడుతూ వడ్డెరలు నిర్మించిన కొండారెడ్డి బురుజు కర్నూల్ కు తలమానికంగా ఉన్నదని , ఇక్కడ నుండి అలంపూర్ కు ఉన్న సొరంగ మార్గాన్ని వెలుగులోకి తీసుకొచ్చి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. కర్నూలులో ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు.ఈ సమావేశానికి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన ,బి.సి.కార్పొరేషన్ ఈడి  జాకీర్  , వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల లక్ష్మి కాంతం ,  జిల్లా అధ్యక్షుడు బండ్ల రవి , వడ్డెర మహిళల రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిక, నాయకులు తిరుపాల్  బాబు , సర్వేశ్వరరావు , జయపాల్ బాబు , సత్యనారాయణ , చంద్ర , వెంకటస్వామి , జానకి రామ్, సోమన్న , శివుడు , బి.సి. సంఘ నాయకులు నక్కమిట్టల శ్రీనివాసులు , వలసల రామకృష్ణ , కుర్మి సంఘం చైర్మన్ మునెప్ప ,ఉప్పర సంఘం డైరెక్టర్ చంద్ర , వాల్మీకి కార్పొరేషన్  డైరెక్టర్ లు వలసల రామకృష్ణ , మురళి , చల్లా వారి వీధి వడ్డెర సంఘ నాయకులు పాల్గోన్నారు.

About Author