వివేకానంద స్ఫూర్తితో యువత చైతన్యవంతులు కావాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆరోగ్యవంతమైన సమాజంలో యువత పాత్ర అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న హోం ఆఫ్ హోప్ అనాధాశ్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత చైతన్యవంతులు కావాలని, మూఢనమ్మకాలు ఆర్థిక స్థితిగతుల పరిస్థితుల ప్రభావంతో బాల్య వివాహాలు జరుగుతున్నాయని, బాల్యవివాహాల వల్ల దేశ భవిష్యత్తు దెబ్బతింటుందని, యువత స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి బాల్య వివాహాలపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్య వివాహ సమాచారం తెలిసిన వెంటనే అధికారులకు తెలియజేస్తూ చైల్డ్ లైన్ 1098 కు సమాచారం అంది ఇవ్వాలని కోరారు. బాల్యవివాహాలు నిరోధించడంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తల పాత్ర కీలకమని బాల్యవివాహలవల్ల మానసిక, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని బాలికల విద్యకి సహకరించి బాలికలను సమాజంలో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేలా అందరూ కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు శంకరప్ప,రిటైర్డ్ ఎం. ఆర్. ఓ జయన్న, రిటైర్డ్ తాసిల్దార్ తిరుపతిసాయి అనాధశ్రమ నిర్వాహకురాలు ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాల్యవివాహాల కు వ్యతిరేకంగా యువతీ యువకులచే ప్రతిజ్ఞ చేయించారు.

