నేడే’ఛలో పోతిరెడ్డిపాడు’ ఏర్పాట్లు పూర్తి
1 min read
ఏర్పాట్లను పరిశీలించిన కాటసాని,సిద్ధార్థ రెడ్డి,డాక్టర్ సుధీర్
నందికొట్కూరు, న్యూస్ నేడు: పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ అభివృద్ధి కోసంఈరోజు గురువారం వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఛలో పోతిరెడ్డిపాడు’బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయినట్లు వైఎస్ఆర్సిపి యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు వైసీపీ నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ సుధీర్ అన్నారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా పోతిరెడ్డిపాడు వద్ద సభా స్థలి స్టేజ్ పార్కింగ్ ను బుధవారం మధ్యాహ్నం వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ గళాన్ని వినిపిద్దాం రాయలసీమ లిఫ్ట్ ఆవశ్యకతను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రాయలసీమ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే రాయసీమ లిఫ్ట్ పూర్తి చేయాలని నేడు సభకు అన్ని రాయలసీమ ప్రాంతాలైన ఉమ్మడి కర్నూలు,కడప, అనంతపురం,చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రాంత వైసీపీ నేతలు,కార్యకర్తలు,రైతులు విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జగదీశ్వర్ రెడ్డి,మన్సూర్, జబ్బార్,చిన్న మల్లారెడ్డి, అలగనూరు చిన్న రామచంద్రారెడ్డి,సుంకేసుల రాముడు,రమణ తదితరులు పాల్గొన్నారు.

