NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాంటిస్సోరిలో దివ్య దీపావళి – భవ్య జీవావరణం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక ఏ-క్యాంపు మాంటిస్సోరి పాఠసాల ప్రాంగణంలో పీ-ప్రైమరీ చిన్నారులు పర్యావరణహిత దీపావళి జరుపుకున్నారు. ఉపాధ్యాయులు చాలా వినూత్న పద్ధతిలో ప్రకృతికి, భూమికి, వాతావరణానికి మేలు చేసే విధంగా వారి ఆకాంక్షలను తెలిపే చిన్న కాగితాలను చెట్లకు ముడుపుగా (జతగా) కట్టారు. ప్రీ-ప్రైమరీ విభాగ సమన్వయకర్త శ్రీమతి కె.సి. జ్యోతి మాట్లాడుతూ… వర్షాలతో పంటలు పండుతూ, నీటి గలగలతో నదులు పారుతూ, అందరి దాహార్తిని తీర్చి ప్రతి జీవికి సంతోషాల వెలుగునిచ్చే దీపావళి కావాలని ఈ ఎకో-ఫ్లెండ్రీ దీపావళి ముఖ్య ఉద్దేశ్యము. ఈ కార్యక్రమం తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రత్యేక పద్ధతిలో జరిగిన ఈ దీపావళి వేడుకలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రమాజ్యోతి, ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీజ్యోతి ల పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *