ఆంధ్ర ప్రదేశ్ లో 11 రోజుల పాటు దస్తావేజుల లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం
1 min read
రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఏలూరుఆంధ్ర ప్రదేశ్ లో 11 రోజుల పాటు దస్తావేజుల లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతున్నట్టు రాష్ట్ర దస్తావేజుల సంఘం నిర్ణయించింది,ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 20వ తేదీనుండి 31 వ తేదీవరకు అనగా 11 రోజుల పాటు రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 298 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెన్ డౌన్ కార్యక్రమం కంటిన్యూగా నిర్వహించనున్నామని అన్నారు , ఈ పెన్ డౌన్ కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తం గా 11 రోజుల పాటు వ్యక్తుల ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లు మధ్య జరిగే రిజిస్ట్రేషన్ లో పూర్తిగా స్తంభింప జేస్తామని అన్నారు. సోమవారం ఏలూరు జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వద్ద పెద్ద ఎత్తున దస్తావేజు లేఖరులు శాంతియుత ధర్నా నిర్వహించారు.



