NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

IIRF ర్యాంకింగ్స్‌లో ‘అశోకా’ కాలేజ్ కి జాతీయ స్థాయిలో  ’47వ’ ర్యాంక్

1 min read

A.P రాష్ట్ర స్ధాయి లో ‘5వ’ స్థానం & దేశవ్యాప్తంగా ’47వ’ స్ధానం సాధించిన ‘అశోకా’ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల

ఘనంగా ‘అశోకా ఎక్సలెన్స్ కాన్-క్లేవ్ 2026’

‘IIRF ర్యాంకింగ్ పోస్టర్‌’ ఆవిష్కరణ కార్యక్రమం

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రతిష్టాత్మక IIRF (International Institutional Ranking Framework) ఇటీవల విడుదల చేసిన 2026 ఇంజినీరింగ్ కళాశాలల ర్యాంకింగ్స్‌లో మన ‘కర్నూలు’ నగరానికి చెందిన ‘అశోకా’ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 47వ ర్యాంకు సాధించి మరోసారి తన విద్యా ప్రామాణికతను చాటుకుంది.ఈ సందర్భంగా శుక్రవారం నాడు ‘అశోకా’ కాలేజ్ ఆడిటోరియం నందు నిర్వహించిన ‘అశోకా ఎక్సలెన్స్ కాన్ క్లేవ్ 2026’ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ హితేష్ శర్మ, Manager – FAAS, Intern & Knowledge Partnership Universities, Ernst & Young, Chennai మరియు డా. గుండాల నాగరాజు, President – World AI Governance, Chief AI Advisor – ESF Labs, Hyderabad లు హాజరై ‘IIRF ర్యాంకింగ్ పోస్టర్‌’ను ఆవిష్కరించారు.అనంతరం ముఖ్య అతిథులతో జరిపిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో IIRF ర్యాంకింగ్స్ ఎంపిక ప్రక్రియ, కళాశాలల మూల్యాంకన విధానం, విద్యా నాణ్యత, పరిశోధన, పరిశ్రమల అనుసంధానం, ప్లేస్‌మెంట్లు, మౌలిక సదుపాయాలు వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు ఎలా నిర్ణయిస్తారనే విషయాలపై వారు చర్చించారు.అదేవిధంగా, ఇంజినీరింగ్ అడ్మిషన్ల సమయంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సరైన కళాశాలను ఎంపిక చేసుకోవడంలో IIRF వంటి జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కళాశాలల పనితీరు, విద్యా ప్రమాణాలు, పరిశ్రమల అనుసంధానం మరియు ఉద్యోగ అవకాశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడంలో ఈ ర్యాంకింగ్స్ కీలక పాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.అనంతరం, ముఖ్య అతిథులు శ్రీ హితేష్ శర్మ & డా. గుండాల నాగరాజు మాట్లాడుతూ..రాయలసీమలోని ‘కర్నూలు’ కి చెందిన ‘అశోకా’ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల A.P లో గల అన్ని కో-ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీలతో సైతం పోటీపడి “రాష్ట్ర స్ధాయిలో ‘5వ’ ర్యాంక్” సాధించడంతో పాటుగా, “జాతీయ స్థాయిలో ’47వ’ ర్యాంక్” మరియు ‘రాయలసీమ స్ధాయి’ లోని “మహిళా ఇంజనీరింగ్ కళాశాలల” కేటగిరీలో ‘నెం.1’ ర్యాంక్  సాధించడం అత్యద్భుతమైన విజయమని కొనియాడారు.  ఈ విజయానికి మరియు కళాశాల అభివృద్ధి కోసం  విశేష కృషి చేసిన IIRF ‘కో-ఆర్డినేషన్ టీమ్’ సభ్యులు మరియు వివిధ విభాగాల అధిపతులను (HODs)వారు చేసిన నిరంతర కృషిని ఈ సందర్భంగా వారు అభినందించి మొమెంటో బహుకరించి సన్మానించారు.’అశోకా’ కాలేజ్ ప్రిన్సిపాల్ డా.ఆర్.నవీన్ మాట్లాడుతూ, ఈ ర్యాంకు కళాశాల యొక్క నాణ్యమైన విద్యా విధానానికి, అధ్యాపకుల అంకితభావానికి మరియు విద్యార్థినుల కృషికి ప్రతీకని,విద్యార్థినులను భవిష్యత్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు పరిశ్రమల భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, 2025&2026 విద్యా సంవత్సరాలకి గాను తమ విద్యార్థినులు ‘1293’ ప్లేస్మెంట్స్ సాధించారని, తమ కళాశాల భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరింత ఉన్నత ర్యాంకులను సాధించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ‘అశోకా’ కాలేజ్ టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొని కాలేజీ సాధించిన ఘన విజయంపై హర్షం వ్యక్తం చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *