NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అశోక ‘ లో .. ‘టెక్ 4 ఆల్ – ఫేజ్ ll’

1 min read

‘ సైబర్ సెక్యూరిటీ ‘ లో నైపుణ్యత పై శిక్షణ

కాగ్నిజెంట్ ఫౌండేషన్ ను అభినందించిన ప్రిన్సిపాల్ డా. నవీన్

కర్నూలు, న్యూస్ నేడు : అశోక వుమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ (A), కర్నూలులో కాగ్నిజంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఐసిటి అకాడమీ సహకారంతో  ‘టెక్ 4 ఆల్ – ఫేజ్ II’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ పై పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణను విద్యార్థులకు అందిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ నవీన్ మాట్లాడుతూ  ఈ శిక్షణ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను మరింతగా పెంపొందించి, సైబర్ సెక్యూరిటీ రంగంలో మంచి ఉపాధి అవకాశాలను అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. విలువైన కార్యక్రమాన్ని కాలేజీకి తీసుకువచ్చిన కాగ్నిజంట్ ఫౌండేషన్ మరియు ఐసిటి అకాడమీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న ఐసిటి అకాడమీ రీజినల్ మేనేజర్ శ్రీ ప్రవీణ్ కుమార్ మరియు ట్రైనర్  విజయ సైబర్ సెక్యూరిటీ శిక్షణ ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ S.A. శివకుమార్, ప్లేస్‌మెంట్ విభాగాధిపతి డాక్టర్ సోమ్యశ్రీ  మరియు విభాగాధిపతులు,  పాల్గొని విద్యార్థులను అభినందించారు.భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి సిద్ధంగా ఉండే మహిళా సాంకేతిక నిపుణులను తయారు చేయడంలో తమ కాలేజ్ ముందంజలో ఉందని కాలేజ్  యాజమాన్యం పేర్కొంది.

About Author