NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీజీహెచ్ అన్న క్యాంటీన్‌ ను  ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

1 min read

నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు, న్యూస్​ నేడు  : అన్న క్యాంటీన్ ద్వారా నాణ్యమైన, రుచికరమైన  భోజనాన్ని అందించాలని జిల్లాకలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్  ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా  కలెక్టర్ క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత, పాత్రల శుభ్రత,  భోజనం చేసే ప్రాంతం, కూర్చునే సౌకర్యాలు, టోకెన్ వ్యవస్థ, తాగునీటి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం క్యాంటీన్ సిబ్బంది,  భోజనం చేస్తున్న ప్రజలతో కలెక్టర్  మాట్లాడి, భోజనం ఎలా ఉంది అని వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భోజనం చేస్తున్న వారిలో  ఒక వ్యక్తి మాట్లాడుతూ…”మా బంధువు మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు,  అన్న క్యాంటీన్‌లోనే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తున్నాము. తక్కువ ధరకు మంచి నాణ్యతతో భోజనం లభిస్తోంది. బయట కంటే ఇక్కడి భోజనం చాలా బాగుంది” అని తెలిపారు. మిగిలిన వారు కూడా భోజనం రుచిగా ఉందని తెలిపారు. అన్న క్యాంటీన్ నిర్వహణలో  లోపాలు ఉండకూడదని,  పరిశుభ్రతా ప్రమాణాలను  పాటించాలని సూచించారు. భోజన నాణ్యతపై రోజువారీ తనిఖీలు నిర్వహించి, రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను  ఆదేశించారు.కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు ఉన్నారు.

About Author