NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్హులెవరికీ పెన్షన్ తొలగించరు..

1 min read

అర్హులైన దివ్యాంగులెవరూ ఆందోళన చెందవద్దు

 అర్హులందరికీ  పింఛన్లు అందాలన్నదే ప్రభుత్వ ఆశయం

దివ్యాంగులు చెంతకు స్వయంగా వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారితో మమేకమైన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం పిజిఆర్ యస్ కార్యక్రమానికి తమ సమస్యలను తెలియజేసేందుకు వచ్చిన దివ్యాంగులు  వద్దకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి  స్వయంగా దివ్యాంగులు చెంతకు   వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసు కున్నారు. దివ్యాంగులు బొర్రా సుధాకరమ్మ, ఇద్దాబత్తుల ప్రసన్న,నక్కా రాము,యు.ప్రవీణ్ కుమారిలు  మాకు నోటీసులు అందాయని, పెన్షన్లు ఆగుతాయని అంటున్నారని కలవటానికి వచ్చామని చెప్పారు. దీంతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి స్పందిస్తూ పింఛన్ల విషయంలో అర్హులైన దివ్యాంగులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.  నూరుశాతం అర్హులకు  పింఛన్లు అందాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అన్నారు. నోటీసులు ఇచ్చినవారికి త్వరితగతిన విచారణ చేసి అర్హులకు యధాతధంగా పింఛన్లను అందజేస్తామని, దివ్యాంగులెవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టరు భరోసానిచ్చారు. పుకార్లు, వదంతులు నమ్మవద్దని,అర్హత ఉన్న పింఛన్లన్నీ యథావిధిగా కొనసాగు తాయని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు. దివ్యాంగులకు సమస్యలు ఏమి ఉన్నా తనను  స్వయంగా తనని కలిసి పరిష్కరించు కోవచ్చన్నారు.ఎక్కువ మంది వచ్చి సమయాన్ని, డబ్బును వృధా చేసుకోవద్దని జిల్లా కలెక్టరు హితవు పలికారు. దీంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి కి కృతజ్ఞతలు  తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం,దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

About Author