NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్టాప్ డయేరియా పై అవగాహన..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని DEIC కేంద్రంలో     అవగాహన కార్యక్రమము ఘనంగా తల్లులతో  నిర్వహించినారు,  రాష్ట్రీయ బాల ఆరోగ్య స్వస్త్య  కార్యక్రమ సమన్వయకర్త    డాక్టర్.మహేశ్వరప్రసాద్  మాట్లాడుతూ  . వర్షాకాలంలో డయేరియా వ్యాధి ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టేందుకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 31 వ తేది వరకు  కార్యక్రమాలు జరుగుతాయని,వర్షాకాలంలో నిటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలె అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తెలిపారు.   ఐదెల్ల లోపు చిన్నారులు డయేరియ బారిన పడకుండా కాపాడడం,వ్యాధిపై అవగాహనా పెంపొందించడం ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 5 సంవత్సరములలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాలకు నీళ్ళ విరేచనాలు కూడా ఓ ముఖ్యకారణం కావడంతో తల్లులకు నీళ్ళ విరేచనాలు, ప్రమాదకర లక్షణాలు, ఓ‌ఆర్‌ఎస్ కలుపుకొనే విధానం ,ఓ‌ఆర్‌ఎస్ త్రాగించే విధానం, చేతులు శుభ్రపరచుకోవడము మొదలగు విషయాల గురించి తల్లులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నీళ్ళ విరేచనాలు సమయంలోనూ మరియు విరేచనాల అనంతరం తల్లి పాలు మరియు అనుబంధ ఆహార పదార్థాలు ఇవ్వాలని . బిడ్డకు మొదటి 6 నెలలు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని తల్లులకు సూచించాలని , చిన్న పిల్లల వైద్యులు డాక్టర్. సృజన  మాట్లాడుతూ బిడ్డకు ఆహారం తినిపించే ముందు, వంట చేయడానికి ముందు,మలమూత్ర విసర్జన తీసివేసిన తరువాత చేతులు శుభ్రముగా సబ్బుతో కడుక్కోవాలని  తల్లులకు  సూచించినారు. , పిల్లల్లో నీరసం,జ్వరం,రక్తంతో కూడిన విరేచనాలు లేదా ఏదైనా ద్రవ పదార్థాలను తాగలేని పరిస్థితి కనుపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీప  ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమములో   DEIC మేనేజర్ ఇర్ఫాన్ , ఆరోగ్య విస్తరణ అధికారి నరసింహులు స్టాఫ్ నర్సులు మాలతీ,సరిత,సోషల్ వర్కర్ యశోద  మరియు  DEIC సిబ్బంది , ప్రొజెక్షనిస్ట్ ఎస్.ఖలీల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *