సూగురు రిజర్వాయర్ కు గండ్లు పడకుండా చర్యలు చేపడతాం
1 min read
చెరువు మరమ్మతులు కోపం ఆర్ ఆర్ ఆర్ కింద రూ 2.50 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి
మంచాల సొసైటీ ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని వగరూరు గ్రామ సమీపంలో నిర్మించిన సూగురు రిజర్వాయర్ కు గండ్లు పడకుండా చర్యలు తీసుకుంటామని మంచాల సొసైటీ ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డి పేర్కొన్నారు. రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు సూగురు రిజర్వాయర్ కు ఆదివారం రాత్రి గండ్లు పడడంతో స్థానిక టిడిపి నాయకులు, రైతులు మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి కి సమాచారం అందించారు. దీంతో తక్షణమే చెరువు దగ్గర కు వెళ్లి పరిశీలించాలని మంచాల సొసైటీ ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డి ని ఆదేశించారు. ఆయన రాత్రికి రాత్రే చెరువు దగ్గర వెళ్లి ఇరిగేషన్ శాఖ అధికారులు జేఈ పరమేష్ తో కలిసి గండ్లను రైతులు పూడ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం చెరువు కట్ట కు గండ్లను పూడ్చడం జరిగిందని తెలిపారు. సోమవారం మరో చోట గండ్లు పడడంతో అధికారులతో కలిసి పూడ్చేంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మరల ఇలాంటి చెరువు కు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులను ఆదేశించారు. చెరువు మరమ్మతులు కోసం ఆర్ అర్ ఆర్ కింద రూ 2.50 కోట్లు మంజూరు అయ్యాయని అయితే అవి పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అవి వచ్చిన వెంటనే శాశ్వత పరిష్కారం చేపడతామని తెలిపారు. చెరువు కట్ట పై ముళ్ల కంపలను తొలగిస్తామని తెలిపారు. తహసీల్దార్ రమాదేవి, ఎంపిడిఓ నూర్జహాన్, ఆర్ ఐ జనార్దన్, విఆర్ఓ ప్రభాకర్, ఇరిగేషన్ జేఈ పరమేష్, మణికంఠ, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, సుధాకర్, టిడిపి నాయకులు అబ్దుల్, పవన్, గోపాల్, లింగప్ప, వీరేష్ తదితరులు ఉన్నారు.

