NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లింగ నిర్ధారణను అరికట్టేందుకు హెల్ప్ లైన్ 1800 2332447 ఏర్పాటు

1 min read

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కర్నూలు , కర్నూలు జిల్లా.

 కర్నూలు, న్యూస్​ నేడు:  లింగ నిర్ధారణను అరికట్టేందుకు రాష్ట్ర టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1800 2332447 గురించి. పి.సి.పి.ఎన్.డి.టి. చట్టం ఉల్లంఘన పై సమాచారం అందించేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 18002332447 నెంబర్ ఏర్పాటు చేసిందని కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై కామేశ్వర ప్రసాద్ గారు పేర్కొన్నారు .హక్కుల పరిరక్షణ, లింగ వివక్ష నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ,గర్భస్థ శిశు లింగ నిర్ధారణ లింగ ఎంపిక అక్రమ కార్యక్రమాలను అరికట్టేందుకు అమలులో ఉన్న ఫ్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనేటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ చట్టం, 1994 ను సమర్ధవంతంగా అమలు చేయడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు . ప్రజల అభ్యర్థనలను స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800 2332447 ను అందుబాటులో ఉంచిందని తెలిపారు.  గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించడం, లింగ నిర్ధారణ సేవలను ప్రచారం చేయడం , లింగ ఎంపికకు  ప్రోత్సహించడం వంటి చర్యలు చట్టవిరుద్దమని, ఇటువంటి కార్యకలాపాలు సమాజంలో లింగ అసమానతలను పెంచడమే కాకుండా ఆడ శిశువు జనన నిష్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సంబంధించిన అక్రమ కార్యకలాపాలు, లింగ నిర్ధారణ సేవలు ప్రకటనలు,అనుమతి లేని స్కానింగ్ లేదా డయాగ్నొస్టిక్ కేంద్రాలు,లింగ ఎంపికను ప్రోత్సహించే ఏ విధమైన చర్యలు ఉన్నా సమాచారాన్ని హెల్ప్ లైన్ ద్వారా తెలియజేయవచ్చు అన్నారు . హెల్ప్ లైన్ ద్వారా అందిన సమాచారం పూర్తిగా  గోప్యముగా  ఉంచబడుతుందని ,సంబంధిత అధికారులచే తగిన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆడ శిశువును రక్షించడం ప్రతి పౌరుని బాధ్యత అని, మహిళా సంఘాలు ,యువజన సంఘాలు, వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు అందరూ కలిసి పి. సి .పి. ఎన్. డి. టి చట్టం అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు . ఈ మేరకు 16.06.2026 తేదీన ఒక ప్రకటనలో తెలియజేశారు.   

About Author