NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష .. విజేతలకు బహుమతులు అందజేత

1 min read

వెలుగోడు, న్యూస్​ నేడు: స్థానిక వెలుగోడు 5 సచివాలయం పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ అండ్ కాలేజీలో క్యాన్సర్ అవగాహన గురించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష పెట్టడం జరిగింది. మరియు విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా మోత్కూరు పిహెచ్సి సూపర్వైజర్ శ్రీదేవి  మాట్లాడుతూ క్యాన్సర్ ని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని అందుకు గల కారణాలు పొగ త్రాగడం, గుట్కా వంటి నమ్మడం మద్యం సేవించడం శారీరక శ్రమ లేకపోవడం అని నోటిలో మూడు వారాలకు మించి పుండ్లు ఉండడం తెల్ల మచ్చలు మరియు ఎర్రటి మచ్చలు ఉండడం నమలడానికి ఇబ్బందిగా ఉండడం ఆహారం మింగడంలో ఇబ్బంది ఉండడం, రొమ్ము నందు గడ్డలుగా ఉండడము నొప్పి లొత్త పడినట్లు ఉండడం మరియు పొత్తికడుపులో నొప్పి ఎక్కువ నెలసరి కావడం వంటి లక్షణాలని విద్యార్థులకు వివరించారు, ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మధు గారు సిహెచ్ఓస్ సౌందర్య, గీత, ఆశ అంకమ్మ పాల్గొన్నారు.

About Author