NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దీపావళి భద్రత పై అవగాహన

1 min read

పెదవేగి ఇన్స్పెక్టర్ సి.హెచ్ రాజశేఖర్,దెందులూరు ఎస్ఐ శివాజీ సిబ్బందితో కలిసి

కార్యక్రమం

ఏలూరు జిల్లా ప్రతినిధి  న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ నూజివీడు డీఎస్పీ  కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్  యొక్క ఆదేశాలపై  రానున్న దీపావళి పండుగ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో పెదవేగి ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. రాజశేఖర్, దెందులూరు ఎస్ఐ శివాజీ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.సోమవరపాడు ఫ్లై ఓవర్ వంతెన  వద్ద ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలకు పోలీసులు భద్రతా సూచనలు జారీ చేశారు.ఎటు వంటి అపాయలు జరగకుండా,అందరూ ఆనందంగా దీపావళి పండుగను జరుపుకోవాలనిగుర్తు చేశారు.ఇన్‌స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్  మరియు ఎస్ఐ శివాజీ  ప్రజలకు కింది విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియ చేసినారు. ప్రజలు సురక్షిత ప్రదేశంలో బాణా సంచా ను కాల్చాలి, టపాకాయలు  నివాస గృహాలకు, గడ్డి వాములకు, లేదా పెట్రోల్ బంకులకు దూరంగా, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని చెప్పారు.టపాకాయలు  కాల్చే సమయంలో చిన్నపిల్లలను పెద్దవారి పర్యవేక్షణ లేకుండా ఒంటరిగా వదలకూడదు.టపాకాయలు కాల్చే ప్రాంతంలో నీరు మరియు ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలియజేశారు .అధిక శబ్దంతో కూడిన లేదా ప్రమాదకరమైన నిషేధిత బాణసంచాను కొనుగోలు చేయకూడదు, ఉపయోగించకూడదని సూచించారు. చిన్నపాటి కాలిన గాయాలు తగిలితే, తక్షణమే ప్రథమ చికిత్స లేదా వైద్య సహాయం తీసుకోవాలన్నరు.పండుగ సందర్భంగా రోడ్లపై వాహనాలు నడిపే టప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి మరియు టపాకాయలు  రోడ్లపై కాల్చకూడదు.పోలీస్ సిబ్బంది ఈ సూచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా, దీపావళిని సురక్షితంగా, ఆనందంగా జరుపుకునేల ప్రజల్లో చైతన్యాన్ని పెంచారు.ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా, వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్  తెలియ చేసినారు.

About Author