ముఖ్యమంత్రి కి కోనసీమ తుఫాన్ పరిస్థితులపై మంత్రి వివరణ
1 min read
అమరావతి, న్యూస్ నేడు: రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఉద్యాన మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు , మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితులపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి సమగ్రంగా వివరించారు. మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా వ్యాప్తంగా పర్యటించి, తుఫాన్ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. గాలులు, వర్షాల కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన విషయాలను ముఖ్యమంత్రి గారికి నివేదించారు. రైతుల పంటల నష్టం, రహదారి రవాణా అంతరాయం, పల్లె ప్రాంతాల్లో గృహాల దెబ్బతినిపరిస్థితులను వివరించారు. తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్, రవాణా, త్రాగునీటి పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, అవసరమైన అన్ని వనరులు సమకూర్చినట్లు వివరించారు. ముఖ్యమంత్రి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై ఎప్పటికప్పుడు సమీక్ష కొనసాగించాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం చూపాలని ఆదేశించారు. రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం సమగ్రంగా పని చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

