మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగండి
1 min read
రవీంద్ర కళాశాలలో ఐదు రోజుల పాటు ఈ ఎస్ డి పి వర్క్‌షాప్ ప్రారంభం
కర్నూలు, న్యూస్ నేడు: రవీంద్ర ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఐదు రోజుల ఈ ఎస్ డి పి వర్క్ షాప్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు వరల్డ్ బ్యాంక్ ఫోరం సహాయంతో మార్చ్ 2 నుండి 7 వరకు నిర్వహించబడును.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్. హఫీజ్ బాషా, సీఈవో, ఆర్టిఐహెచ్.మరియు ఎస్. ఖాజా మాలిక్ సర్, యం డి, గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, కర్నూల్, విచ్చేశారు. గౌరవ అతిథులుగాకె. వసుంధర , వ్యవస్థాపకులు, గుర్తింపు ఫౌండేషన్,రుద్విక్ ధర్మకర్ , CEO, ఫ్లెకర్ టెక్, తెలంగాణ క్రానికల్,విచ్చేశారు. వక్తలు వారి ప్రసంగాలలో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న ఈ ఐదు రోజుల ఈఎస్డిపి ప్రోగ్రాం మహిళలను వారి సొంత కాళ్లపై వాళ్లు నిలబడేలా చేసే కార్యక్రమమని, మహిళలు ఈ కాలంలో అన్ని రంగాల్లో వారి సత్తా చాటుతున్నారని అదే విధంగా వ్యాపారంలోనూ రాణించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలియజేశారు.వ్యాపారం చేయడం అనేది కేవలం పురుషులకే కాదు మహిళలు వంట చేసినంత సులభంగా వ్యాపారాన్ని కూడా నిర్వహించగలరు తెలియజేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వ్యాపార నైపుణ్యాలను నేర్పడం, ప్రోత్సహించడం మరియు వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా మార్చడం, వ్యాపార ఆలోచనలు & ప్రణాళిక మరియు నైపుణ్యాల పెంపు. ఈ నైపుణ్యాల ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని తెలియజేశారు. అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె.ఇ. శ్రీనివాస మూర్తి, SPOC డాక్టర్ పి. బిందుస్వేత మరియు వివిధ విభాగాల డీన్స్, విద్యార్థులు పాల్గొన్నారు.


