రోడ్లు డ్రైనేజీల కొరత లేకుండా చూస్తాం – భూమా అఖిలప్రియ
1 min read
ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
గజమాలలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
చాగలమర్రిలోని పలు కాలనీలో సిసి రోడ్లు ప్రారంభోత్సవాలు
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు జీతం మాత్రం కావాలి
1. సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
2. మాట్లాడుతున్న భూమా అఖిలప్రియ
చాగలమరి రూరల్ న్యూస్ నేడు: చాగలమర్రి మండలంలో ఎక్కడ కూడా రోడ్లు డ్రైనేజీల కొరత ఉండకుండా ఉండాలని ఉద్దేశంతోనే పనులని త్వరగా పూర్తి చేస్తున్నామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే చాగలమరి పట్టణంలో సుడిగాలి పర్యటన చేసి పలు కాలనీలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాగలమర్రి మండలం ఎన్ఆర్ఈజీఎస్ మొదటి విడత కింద వేసిన నాలుగు రోడ్లను ప్రారంభించడం జరిగిందని,మొదటి విడత రెండు కోట్ల 50 లక్షలు ,రెండో విడత లో రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు మంజూరు అయిందన్నారు.గత ప్రభుత్వంలో చాగలమర్రి మండలానికి సంబంధించిన టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందని, వైసీపీ నాయకులు మాకు లోపల పనులు జరుగుతున్నాయిలే ఏమీ కాదులే అంటూ అనుకుంటున్నారేమో ఆరు నెలలు ఆగండి సిసి రోడ్లు ప్రజలకు చేసే అభివృద్ధి అంతా అయిపోయిన తర్వాత రాజకీయం కూడా మొదలు పెడతామన్నారు. ఎన్నికలకు ముందు వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి పోటీ చేస్తుంటే మేము సింహం సింగిల్ గా పోటీ చేస్తాం అంటూ మాట్లాడారని ఇప్పుడు ఆ సింహాలు ఎక్కడ ఉన్నాయో మరి జ్యూలో ఉన్నాయో అడవిలో ఉన్నాయో అసెంబ్లీకి మాత్రం రావడం లేదన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆళ్లగడ్డను అభివృద్ధి చేసి చూపిస్తానని, ఆళ్లగడ్డ నుంచి అమరావతి వరకు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.గతంలో వైసీపీ కీ 11 సీట్లకే పరిమితం చేశారని రాబోయే రోజుల్లో అవి కూడా లేకుండా ప్రజలే మిమ్మల్నితరిమికొడతారన్నారు.
ఎమ్మెల్యేలకు గజమాలతో ఘన స్వాగతం
ఆదివారం చాగలమరి పట్టణంలో పలు కాలనీలలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్ల ప్రారంభోత్సవమునకు విచ్చేసిన అలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు చాగలమరి పట్టణ టిడిపి నాయకులు కొలిమి హుస్సేన్ వల్లి, కొలిమి మాబు షరీఫ్, నాగూర్,ఇంతియాజ్, గాంధీ నాయి బ్రాహ్మణ నాయకులు గజమాలలతో పూలవర్షం కురిపిస్తూ టపాసులు పేలుస్తూ ఘన స్వాగతం పలికారు.
కూలూరు రస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మించండి —
కాలనీవాసులు
పట్టణంలోని కూలూరు వస్తా వద్ద జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మించి ప్రమాదాలను అరికట్టే కాపాడవలసిందిగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ను కాలనీవాసులు వినతులను సమర్పించుకున్నారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీలలో తాగునీరు విద్యుత్ రహదారులు మౌలిక సదుపాయాలు కల్పించే తమను ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ అక్కడే ఉన్న పిఆర్ఏఈ, తహసిల్దారును కాలనీలో పర్యటించే వాళ్లకు కావాల్సిన మౌలిక సదుపాయాల ను నివేదికను తయారుచేసి తనకు ఇవ్వాలని నివేదికలు అందిన వెంటనే కాలనీలలో అభివృద్ధి పనులు చేపడతామని కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీని ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ భాష,టిడిపి మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి, మీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ముల్లా అజిముద్దీన్, టిడిపి నాయకులు కొలిమి హుస్సేన్ వల్లి కొలిమి మాబు షరీఫ్ ఆలంశ మౌలాలి హనీఫ్ జట్టి నాగరాజు దాదా బీడి భాష నూర్ భాషా అబ్దుల్లా బారిక్షమల్ హుస్సేన్సా, వివిధ గ్రామాల టిడిపి నాయకులు భూమా అభిమానులు పాల్గొన్నారు.

