బేడ బుడగ జంగం కులానికి రిజర్వేషన్ కల్పించకపోవడం ఎవరిది తప్పు- యువత హెచ్చరిక
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ టౌన్, బిర్లా కాంపౌండ్ , బ్రహ్మారెడ్డి హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్. బేడ బుడగ జంగం యువత సదస్సు జరిగింది.18 సంవత్సరాల నుంచి బేడ బుడగ జంగం కులమునకు ప్రభుత్వాలు మారుతున్న, హామీలకే పరిమితం చేస్తూ, అన్యాయం చేస్తున్నారు తప్ప న్యాయం చేయడం లేదు ఇది ఎవరిది తప్పు ప్రభుత్వాలు పాలకులు తప్పు కాదా అంటూ యువత హెచ్చరించారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ కే యువత అంతా బాధలో ఉంటే, 18 సంవత్సరాల నుంచి బేడ బుడగ జంగం కులమునకు, ఆన్లైన్లో సర్టిఫికెట్ ఏ రిజర్వేషన్ పరంగా పొందలేక, ఉన్నంత విద్యాపరంగా, ఉద్యోగాలపరంగా అన్యాయం జరుగుతుంటే ఎంత బాధలో ఉంటామో ప్రభుత్వము ఆలోచించుకోవాలి, ఉద్యమ బాట పడితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి యువత డిమాండ్ చేశారు.రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ మాట్లాడుతూ: – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు బేడ బుడగ జంగం కమ్యూనిటీకి ఎస్సీ బెనిఫిట్స్ అన్ని విధాలుగా అందించాలని, విజయవాడ కలెక్టర్ల ప్రోగ్రాం లో ఆదేశాలు జారీ చేసిన, ఇంప్లిమెంట్ ప్రభుత్వ అధికారులు చేయకపోవడం దారుణమైనది. కనుక మా యువత ఉన్నత విద్య, ఉద్యోగాలపరంగా జరుగుతున్న అన్యానికి అక్రోసంతో ఉన్నారు అటు యువత విద్యార్థులు ఇటు మా జాతి ప్రజలు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందక బాధలో ఉన్నారు. మీరు రానా రోడ్డుపై వస్తే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు. కావున కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ద్వారా పంపించిన నివేదికను కేంద్రంలో పార్లమెంట్ లో తక్షణమే చట్టబద్ధ కల్పించి పూర్తిస్థాయిలో బేడ బుడగ జంగం కులములకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ శాతం యువత పాల్గొన్నారు.


