సీబీఎస్ఈ సౌత్ జోన్ యోగాసన పోటీలలో రిడ్జ్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాల విద్యార్థులు సీబీఎస్ఈ సౌత్ జోన్ యోగాసన పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు, కర్నూలు జిల్లాకు విశేష కీర్తి తీసుకొచ్చారు.జూలై 26 నుండి 31 వరకు హైదరాబాద్‌లోని హార్ట్‌ఫుల్‌నెస్ స్కూల్ లో నిర్వహించిన సీబీఎస్ఈ సౌత్ జోన్ యోగాసన పోటీలలో రిడ్జ్ పాఠశాల విద్యార్థులు ఆర్టిస్టిక్ పెయిర్లో కె. లక్ష్మీకాంత్, సి.చరితార్థ్ అత్యుత్తమ ప్రదర్శనతో విజేతలుగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో సీఈఓ జి గోపీనాథ్ మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఈ విజయం ఎంతో ప్రశంసనీయమని, వారి కృషి, క్రమశిక్షణ, పట్టుదల ఫలితమే ఈ ఘన విజయం అని అన్నారు. ఈ విజయంతో పాఠశాలకు మాత్రమే కాకుండా కర్నూలు జిల్లాకు కూడా మంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.కో-సీఈఓ సౌమ్య గోపీనాథ్ గారు మాట్లాడుతూ, యోగాసనాలు విద్యార్థుల చేయడం వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, శరీర వశ్యత (ఫ్లెక్సిబిలిటీ) పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి విద్యార్థి యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ఆకాంక్షించారు.విద్యార్థులను ఈ స్థాయికి తీర్చిదిద్దిన యోగాసన గురువు శ్రీ కె. గంగన్న గారిని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్, ప్రిన్సిపల్ ఏ. రాజ్‌కమల్ , హెచ్‌ఓడీలు నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొని విజేత విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


