మెదడులోని రక్తనాళాలకు అరుదైన చికిత్స
1 min read
తీవ్రమైన తలనొప్పి, మతిమరుపు లాంటి సమస్యలు
లక్ష మందిలో ఒకరికే వచ్చే అత్యంత అరుదైన సమస్య
ఆరు గంటల శస్త్రచికిత్సతో నయం చేసిన కిమ్స్ సవీరా వైద్యులు
అనంతపురం, న్యూస్ నేడు: ఆయన కాయకష్టం చేసుకునే రైతు. వయసు 47 ఏళ్లు. అప్పటివరకు పెద్దగా ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు విపరీతమైన తలనొప్పి వచ్చింది. తర్వాత క్రమంగా కొన్ని విషయాలు మర్చిపోవడం మొదలైంది. దీంతో ఆయన అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనను క్షుణ్ణంగా పరీక్షించి, సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి నయం చేసిన కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ సి. అనిల్ మరియు డా. మురళీ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “కనేకల్లుకు చెందిన పకీరప్ప అనే ఆ రైతు తీవ్రమైన తలనొప్పి, మతిమరుపు, ఇతర లక్షణాలతో మా వద్దకు వచ్చారు. వెంటనే ఆయనకు సీటీ యాంజియోగ్రామ్ పరీక్ష చేసి అసలు సమస్య ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేశాం. అప్పుడు ఆయనకు ఆర్టెరియోవీనస్ మాల్‌ఫార్మేషన్ (ఏవీఎం) అనే సమస్య ఉందని తెలిసింది. సాధారణంగా మనకు రక్తనాళాల నుంచి కాపిలరీల గుండా మెదడులోకి రక్తప్రసారం అవుతుంది. కానీ, ఈయన విషయంలో అలా కాకుండా నేరుగా రక్తనాళాల నుంచి నరాల్లోకి రక్తం వెళ్లిపోయింది. దాంతో నరాలు బాగా ఉబ్బిపోయాయి. అవి సరిగ్గా మెదడులో కీలక ప్రాంతాల వద్దే ఉబ్బడంతో ఈయనకు మతిమరుపు లాంటి సమస్యలు వచ్చాయి. అందువల్ల అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఇలాంటి ప్రధాన సమస్యలకు ఇక్కడే చికిత్స పొందొచ్చు” అని డాక్టర్ సి. అనిల్ వివరించారు.

