NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో మార్కెట్ పరిసరాల పరిశుభ్రత

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: స్వచ్ఛత హి సేవా–2026 కార్యక్రమంలో భాగంగా ప్యాపిలి పట్టణంలోని మార్కెట్ పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్ ప్రాంతాల్లో బ్లీచింగ్ సున్నం చల్లి, పరిసరాలను శుభ్రపరిచి పరిశుభ్రతను మెరుగుపరిచారు.ఈ సందర్భంగా  ఈఓ నాగేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్ వారు మాట్లాడుతూ ప్రజలు, వ్యాపారులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, తేదేపా నాయకులు గోల్ల రామ్మోహన్ యాదవ్, ఎస్ కే వలి,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author