NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ దాడి హేయం .. మహిళల గౌరవాన్ని తుంచేసే చర్య

1 min read

బీసీ మహిళా జెడ్పీ ఛైర్‌పర్సన్ గౌ. శ్రీమతి ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఎమ్మిగనూరు బీసీ సెల్ అధ్యక్షులు టి. మురళి నాయుడు

ఎమ్మిగనూరు న్యూస్​ నేడు:  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇంచార్జ్,మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక  ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు టి. మురళి నాయుడు  బిసి నేతలతో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, బీసీ మహిళా నాయకురాలుశ్రీమతి ఉప్పాల హారిక  మరియు ఆమె భర్త రాము  శనివారం గుడివాడలో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే నిమిత్తం ప్రయాణిస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు తీరదయ్యే స్థాయిలో దాడికి పాల్పడిన ఘటనను  కర్నూలు జిల్లా  తీవ్రంగా ఖండించారు.జిల్లా ప్రజా ప్రతినిధిగా, ప్రభుత్వ హోదా కలిగిన జెడ్పీ ఛైర్‌పర్సన్‌గానే కాకుండా, బీసీ మహిళా సామాజిక ప్రతినిధిగా  హారిక ఉన్నారు. అలాంటి ఒక ప్రజా ప్రతినిధిపై ఇలా రాజకీయ పక్షపాతంతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించాల్సి వస్తుంది. మహిళల భద్రతపై ప్రభుత్వానికి అంతకంతకూ విఫలమవుతున్న నిర్వాహక చర్యలకు ఇది నిదర్శనమని ఆయన మండిపడ్డారు.ఒక మహిళ నాయకురాలి కారుపై దాడి జరిగిన సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని టి. మురళి నాయుడు గారు తీవ్రంగా విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన వాహక యంత్రాంగం చేతులెత్తేయడం ఎంతటి అపవాదం అనే దానికీ ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. మహిళలపై, బీసీ సామాజిక వర్గాలపై టీడీపీ చూపిస్తున్న అహంకార ధోరణి ప్రజాస్వామ్య విలువలకు తలెత్తు మచ్చగా అభివర్ణించారు.మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలకు, మహిళలకు, హరిజన గిరిజన వర్గాలకు గొప్ప గుర్తింపు, గౌరవప్రదమైన పదవులు దక్కాయని టి. మురళి నాయుడు గుర్తుచేశారు. అయితే ఇప్పటి టీడీపీ హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఇటువంటి హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రజలు త్వరలోనే సరైన తీర్పు ఇస్తారని హితవు పలికారు.

About Author