సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని, నూతన విత్తన చట్టాన్ని నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, వి బి జి రామ్ జి ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రధాన డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలు, అఖిలభారత రైతు కిసాన్ సంయుక్త మోర్చా ఈనెల 12 తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక ఏఐటీయూసీ, సిఐటియు ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ బైక్ ర్యాలీని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్.క్రిష్ణయ్య సిపిఎం మండల కార్యదర్శి సి.వెంకటేశ్వర రెడ్డి లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్.కృష్ణయ్య సి ఐ టి యు మండల కార్యదర్శి రవిచంద్ర ,రైతు సంఘం కార్యదర్శి బి సురేంద్ర కుమార్ లు మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నుండి భారతదేశ కార్మిక వర్గం త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల రద్దు వెనుక బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల కుట్ర దాగి ఉందన్నారు. ఈ లేబర్ కోడుల వలన ప్రపంచ కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పని విధానం ఉద్యోగ భద్రత, సమ్మె హక్కు లాంటి అనేక హక్కుల కోల్పోయి యజమానులకు కార్మికుల ఆధునిక బానిసలుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే లేబర్ కోర్లు రద్దు అయ్యేంతవరకు పోరాటాలు సాగిస్తామన్నారు.

