హంద్రీనీవా ప్రధాన కాలువ కింద ఎడమ కుడి కాలువల పనులు తక్షణమే చేపట్టాలి
1 min read
సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య డిమాండ్
పత్తికొండ , న్యూస్ నేడు: హంద్రీనీవా ప్రధాన కాలువ క్రింద ఉన్న పందికోన,కృష్ణగిరి రిజర్వాయర్లు కుడి, ఎడమ కాలువలు స్టిరికరణ పనులు, పంట కాలువలు పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించి జిల్లా లో లక్ష ఎకరాలుకు సాగునీరు అందించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ లో సీపీఐ, ఎ. పి. రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంబాల దగ్గర ప్రధాన రహదారిలో ధర్నా కార్యక్రమం నిర్వహించరు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన బి. గిడ్డయ్య మాట్లాడుతూ, పందికోన, కృష్ణగిరి దగ్గర రిజర్వాయర్లు క్రింద ఉన్న కుడి, ఎడమ కాలువ స్థిరకరణ పనులు చేపట్టి పూర్తి చేయాలనీ అయన కోరారు. ఈ పనులు పూర్తి చేసేదానికోసం రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అప్పటి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వనికి నివేదిక పంపారాని గుర్తు చేసారు. ఆ నివేదికను జలవనరులు ధ్వారా పంపాలని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు పంపిందని చెప్పారు. జలవనరుల శాఖ వారు తిరిగి అ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కు పంపించిందని అన్నారు. జలవనరులు శాఖ వారు పంపించిన నివేదికను కూడా రాష్ట ప్రభుత్వం వెనక్కు పంపించిందని ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట ప్రభుత్వంకు చేయాలనే శిత్త శుద్ధి ఉంటే ఎలాంటి నివేదికలు అవసరం లేదని గుర్తు చేసారు.ప్రధాన మంత్రి కర్నూలు జిల్లా పర్యటన వచ్చినప్పుడు జి. ఎస్. టి. సంబరాలు పేరుతో 4 వందల కోట్ల రూపాయలు ప్రజా ధనం ఖర్చు చేసారని తెలిపారు. ఇలా అనవసరం అయిన వాటికీ ప్రజా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తున్నారని వాపోయారు.

